దేశంలో అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడో చోట గ్యాంగ్ రేప్ లు, చిన్నపిల్లలపై అత్యాచారాలు పెట్రేగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. కామాంధులు ఆగడం లేదు. అతి దారుణంగా ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ లో అత్యాచార ఘటన చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని రేవాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు కామాంధుడు. ఈ ఘటనపై మహిళ ఏడుస్తూ వచ్చి జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడిపై మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తాను రైలులో వస్తువులు విక్రయిస్తానని, తాను రైలు ఎక్కినప్పుడు.. బోగీ మొత్తం ఖాళీగా ఉందని మహిళ తెలిపింది. దీన్ని అవకాశంగా తీసుకున్న…
తల్లి తర్వాత విలువైన సంబంధం కలిగి ఉండేది తండ్రికే. కూతురు-తండ్రి మధ్య బంధం అంటే ఎంతో బలంగా ఉంటుంది. కూతురికి తండ్రి అంటే గొప్ప నమ్మకం, ధైర్యం. కానీ అలాంటి తండ్రే ఓ కూతురి పట్ల కామ మృగాడిలా ప్రవర్తించాడు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కూతురిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా.. తాను అత్యాచారానికి పాల్పడ్డ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని.. చెప్తే చంపేస్తానని కూతురిని…
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపు చూసేందుకు వెళ్లిన అమాయక బాలికపై గుర్తు తెలియని యువకుడు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో బాలిక ముఖం, ప్రైవేట్ భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
ప్రేమ పేరుతో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికను ఓ హిందీ టీచర్ మోసం చేశాడు. అంతేకాదు.. ఆ బాలికను కిడ్నాప్ చేసి, తాళి కూడా కట్టాడు. పెళ్లి చేసుకున్నానని చెప్పి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో చోటు చేసుకుంది.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారిపోయాడు.. 15 ఏళ్ల చిన్నారిపై కన్నేశాడు.. పాఠాలు నేర్పాల్సిన గురువు.. ప్రేమ పాఠాలు బోధించాడు.. తాను ప్రేమిస్తున్నాను అని నమ్మబలికాడు.. విద్యార్థినికి మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లాడు.. తాళికట్టి.. ఇక, మనకు పెళ్లి అయిపోయింది.. అంటూ ఆ తర్వాత అత్యాచారానికి తెగబడ్డాడు.
రాజధాని ఢిల్లీలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. మయూర్‌విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ టైలర్ 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన వద్దకు బట్టలు కొనేందుకు వచ్చిన బాలికపై ఈ అఘాయిత్యం చేశాడు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్ లో ఓ సంఘటన వెలుగు చూసింది. 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి మూడు నెలల పాటు అత్యాచారం చేశాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చిన్నారులపై, మహిళలపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. చాకెట్లు ఇస్తామని నమ్మించి అభం శుభం తెలియని చిన్నారులపై కూడా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. దేశంలో ఏదో ఓ మూల ప్రతిరోజు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చుట్టు పక్కల వారు, చుట్టాలు, చివరికి కన్న తండ్రి, తండ్రి వరుస, అన్న వరుస అయ్యేవారు కూడా ఆడవారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మేడిపల్లిలో ఓ మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తరుచుగా గంజాయి సేవించే…