Delhi: 12 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం.. నిందితుడిపై పోక్సో కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని ఢిల్లీలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. మయూర్‌విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ టైలర్ 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన వద్దకు బట్టలు కొనేందుకు వచ్చిన బాలికపై ఈ అఘాయిత్యం చేశాడు. అయితే నిందితుడి చెర నుంచి తప్పించుకుని బాలిక ఎలాగోలా తన ఇంటికి చేరుకుని తన తల్లికి జరిగిన దారుణాన్ని వివరించింది. అయితే ఆ బాలిక మాటలు విన్న తల్లి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Crime News: దారుణం.. చిన్నారిని కిరాతకంగా రాయితో కొట్టి హతమార్చిన సవతి తల్లి
Also Read
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. 12 ఏళ్ల బాలిక 7వ తరగతి చదువుతుంది. సెప్టెంబరు 27న.. ఆ బాలిక పాఠశాల నుండి వచ్చి భోజనం చేస్తుండగా.. ఆమె తల్లి ఆమెను, ఆమె చెల్లెలను సమీపంలోని టైలర్ ఇబ్రాన్ భయ్యా నుండి బట్టలు తీసుకురావాలని కోరింది. చెల్లెలు నిరాకరించడంతో బట్టలు కొనేందుకు టైలర్ వద్దకు బాలిక ఒంటరిగా వెళ్లింది. దీంతో బాలికను ఓ గదిలోకి తీసుకెళ్లి ఆమెపై అమానుషమైన చర్యలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక అతని బారి నుంచి ఎలాగోలా తప్పించుకుని ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి జరిగిన మొత్తం విషయాన్ని తల్లికి తెలిపింది.
Asian Games 2023: ఆసియా క్రీడల్లో పతకాల జోరు.. 60కి చేరిన భారత్ పతకాల సంఖ్య
అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న 19 ఏళ్ల నిందితుడు ఇబ్రాన్‌ను.. యూపీలోని ఖోడాలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీసీపీ అమృత గుగులోత్ తెలిపారు. అతనిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
-
Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!