High Court: టీనేజ్‌లో అత్యాచారానికి గురై గర్భం దాల్చిన బాధితురాలకి కోర్టు ఉపశమనం కలిగించింది. అత్యాచారా బాధితురాలు తన 8 నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో విచారణపై వెనక్కి తగ్గబోమని, దీనిపై అఫిడవిట్ సమర్పించాలని బాధితురాలి తండ్రిని కోర్టు ఆదేశించింది. తన గర్భాన్ని రద్దు చేయాలంటూ మైనర్ సర్వైవర్ చేసిన పిటిషన్‌ను అనుమతించిన హైకోర్టు జనవరి 2న ఉత్తర్వులు జారీ చేసింది.