జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్ కేసులో పోలీసుల విచారణ జరుగుతోంది. బాధితురాలి రెండోసారి స్టేట్‌మెంట్ రికార్డ్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఇంటిదగ్గర దింపుతామని బాధితురాలిని ట్రాప్ చేసి మరీ అత్యాచారం చేసినట్లు తెలిసింది. నిందితులే తనను బలవంతం చేశారని బాధితురాలి రెండోసారి స్టేట్‌మెంట్‌లో వెల్లడైంది. పబ్ నుండి బయటికి వచ్చిన తన స్నేహితురాలు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిందని బాధితురాలు తెలిపింది. తనను పబ్‌కి తీసుకొచ్చిన స్నేహితుడు పబ్ లోపలే ఉన్నాడని, ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్…