దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అత్యాచార ఘటనలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కోల్‌కతాలోని ఆర్‌జి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరంతరం విమర్శలకు గురవుతున్న తరుణంలో సీఎం మమత ప్రధానికి లేఖ రాయడం చర్చనీయంశంగా మారింది.
హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అత్యాచారం ఆలోచనే రానివ్వకుండా నిందితులకు శిక్షలు విధించాల్సిన అవసరముందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు, పాతబస్తీ అభాగ్యురాలిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఆడబిడ్డలపై అత్యాచారాలను నిరోధించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న శిక్షలే కాకుండా అటువంటి ఆలోచనలే మృగాళ్లకు రాకుండా సంస్కరణలు తీసుకు రావాలని అభిప్రాయపడ్డారు. ఈ మధ్యకాలంలో ఏపీలో తరచూ అత్యాచార ఘోరాలు జరుగుతూనే ఉన్నాయని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.…