National List of Essential Medicines: జాతీయ ఆవశ్యక ఔషధాల జాబితాను రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ జాబితాలో కొత్తగా 34 రకాల మందులను చేర్చడంతో పాటు 26 మందులను తొలిగించారు. మొత్తంగా జాతీయ ఆవశ్యక ఔషధాల జాబితాలో మొత్తం ఔషధాల సంస్య 384కు చేరుకుంది. అనేక యాంటీబయాటిక్స్ తో పాటు కాన్సర్ నిరోధక మందులను ఈ జాబితాలో చేర్చారు. దీని వల్ల వీటి ధలరు మరింతగా దిగివచ్చే అవకాశం ఉంది.