Rana Daggubati: యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకొని సాగుతున్నారు. తాత రామానాయుడు పేరునే పెట్టుకున్న రానా ఆయన అడుగుజాడల్లోనే పయనిస్తూ నటన, నిర్మాణంలోనూ పాలుపంచుకున్నారు. ఇక వ్యాఖ్యాతగా, సమర్పకునిగానూ తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ అందుకున్నారు. తమ దగ్గుబాటి ఫ్యామిలీలోనే తన రూటే సెపరేటు అంటున్నారాయన. మరో చెప్పాలంటే వారి ఫ్యామిలీలో 'లక్కీ బోయ్' రానాయే అనీ అనవచ్చు.