గతంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై సీఎం రివ్యూ మీటింగ్ చేసింది లేదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని చాలా సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇరిగేషన్ , ఇండస్ర్టీలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
టీడీపీకి కంచుకోటగా శ్రీకాకుళం జిల్లా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎయిర్‌పోర్టు పూర్తి చేయాలనుకుంటున్నామన్నారు. మూలపేట పోర్టు పూర్తి చేసి సంవత్సర కాలంలో షిప్ వచ్చేలా చేస్తామన్నారు.
ఖరీదైన టికెట్లు కొనుగోలు చేసి విమానాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సౌకర్యాలు ఎంత బాగుండాలి. అలాంటిది ఫ్లైట్‌లో వడ్డించిన ఆహారంలో బొద్దింక ప్రత్యక్షం కావడంతో ఎయిరిండియా విమానంలో తీవ్ర కలకలం రేగింది. ప్రయాణికుడు భారత విమానాయాన శాఖకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా అందుకు సంబంధించిన చిత్రాలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఏపీఎంసీ ఛైర్మన్‌గా కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును సింగపూర్ దేశం ప్రతిపాదించగా భూటాన్ దేశం మద్దతుతో ఆయా దేశాల ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంటే 40 సభ్య దేశాల ప్రతినిధులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రం అన్ని రంగాల్లో కుంటిబడిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. క్రీడలకు ఆదరణ తగ్గించారని.. క్రీడలు అభివృద్ధికి రాజమండ్రి నుంచి నాంది పలుకుతాని పేర్కొన్నారు.
Rammohan Naidu: దేశంలో ఈ రోజు తొమ్మిది ఎయిర్ పోర్టులలో డీజీ యాత్ర సేవలు ప్రారంభించాం అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో 24 విమానాశ్రయంలలో డీజీ యాత్ర సేవలు అందుబాటులో ఉన్నాయి.. 3 కోట్ల మంది విమాన ప్రయాణికులు డీజీ యాత్ర సేవలను వినియోగించుకున్నారు.
ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారని.. తనపై నమ్మకంతో ప్రధాని మోడీ పౌర విమానయాన శాఖ అప్పగించారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనపై పెట్టిన బాధ్యతకు సంపూర్ణ న్యాయం చేస్తానని రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా అన్నారు.
కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కినందుకు హర్షం వ్యక్తం చేశారు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. కాసేపట్లో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్న తరుణంలో ఆయన సోషల్ మీడియాలో తన సందేశాన్ని విడుదల చేశారు. ఈ ఆనందానికి కారణమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.