Sankranti Rush: సంక్రాంతి పండగ దగ్గరపడుతుండటంతో విజయవాడ నుంచి రాకపోకలు సాగించే రైళ్లు, బస్సుల్లో భారీ రష్ మొదలైంది. పండుగకు కనీసం రెండు వారాల ముందు నుంచే రాకపోకలపై విపరీతమైన డిమాండ్ పెరగడంతో రిజర్వేషన్లు పూర్తిగా నిండిపోయాయి. సంక్రాంతి సెలవులను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు ముందస్తుగా బుకింగ్ చేసుకోవడంతో, జనవరి 10 నుంచి 14 వరకు అన్ని రైళ్లలో సీట్లు పూర్తిగా బుక్ అయిపోయాయి. వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోతోంది. జనవరి 15, 16 తేదీల్లో మాత్రమే…