రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం బెంగళూరు, శివమొగ్గ జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఇందులో భాగంగా బెంగళూరు నగరంలోని ఐదు చోట్ల, శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి పట్టణంలోని కొన్ని ఇళ్లపై ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో బాంబు పెట్టిన అతనికి ప్రత్యక్ష సంబంధం, అతనికి ఆర్థిక సహాయం అందించిన అనుమానిత వ్యక్తులపై దాడులు నిర్వహించినట్లు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్ఐఏ చర్యలపై మరిన్ని…