పెరుగుతున్న ఆహార పదార్థాల ధరలతో కష్టాల్లో కూరుకుపోయిన కూరగాయల వ్యాపారికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన చేతులతో భోజనం వడ్డించారు. ఇటీవల ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండీలో పెద్దసంఖ్యలో టమాటాలు కొనేందుకు వచ్చిన రామేశ్వర్... అక్కడి ధరలు చూసి టమాటాలు కొనలేకపోయాడు. టమాటాల ధరలు చూసి అతడు కన్నీటి పర్యంతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆజాద్‌పూర్ మండి కూరగాయల విక్రేత రామేశ్వర్‌ను కలిశారు. అనంతరం రామేశ్వర్‌తో కలిసి రాహుల్ భోజనం చేశారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో రామేశ్వర్ కూరగాయలు అమ్ముతున్న వీడియో వైరల్ అయింది.