ఈ కాలంలో ప్రేమ కథలకు ఏ పేర్లు పెడుతున్నారో కానీ, ఒకప్పుడు సుఖాంత ప్రేమకథలను ‘పాతాళభైరవి' తోనూ, విషాదాంత ప్రేమకథలను ‘దేవదాసు‘ సినిమాతో్నూ పోల్చేవారు. తెలుగు చిత్రసీమలో అలా ప్రేమవ్యవహారాలు ఆ సినిమాలు వెలుగు చూడక ముందే చోటు చేసుకున్నాయి. దిగ్దర్శకుడు పి.పుల్లయ్య, నటి శాంతకుమారిని ప్రేమించి పెళ్ళాడారు. అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి, దర్శకుడు పి.రామకృష్ణను ప్రేమవివాహం చేసుకున్నారు. ఆ దంపతులు భావి సినీజనానికి ఆదర్శంగానూ నిలిచారు. ఆ తరువాత తెలుగు సినిమా రంగంలో నటీనటులు…