Ramayana: బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’. భారతదేశపు అతిపెద్ద చలనచిత్ర ప్రాజెక్టుగా నిలిచింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటిస్తున్న ఈ మూవీ అతిపెద్ద ప్రాజెక్ట్ గా చెబుతున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సుమారు రూ.4,000 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద చలనచిత్ర ప్రాజెక్టులలో ఒకటిగా పేరుగాంచింది. తాజాగా ఈ సినిమా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో చిత్ర…