యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శిల్పం వర్ణం కృష్ణం సెలబ్రేటింగ్ ది హెరిటేజ్ ఆఫ్ రామప్ప పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మిరుమిట్లు గొలిపే రంగురంగుల లేజర్ షోతో రామప్ప వెలిగిపోతోంది.
వారం రోజులుగా కురుస్తున్న వానలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో రహదాలు స్తంబించాయి. భారీ వర్షాల నేపథ్యంలో.. ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ముప్పును ఎదుర్కొంటోంది. కురుస్తున్న భారీ వర్షాలతో ఆలయం చుట్టూ వరద నీరు వచ్చి చేరుతోంది. ఈనేపథ్యంలో.. మురుగు కాల్వలోకి సాఫీగా నీరు వెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో.. ఆలయ ప్రాంగణంలోనే వర్షపు నీరు నిలిచిపోతోంది. అయితే.. రామప్ప దేవాలయం.. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక…