ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వం విచిత్రమైన పరిస్ధితిని ఎదుర్కోంటోంది. గత ఎన్నికల్లో 11 స్ధానాలను గెలుచుకోగా… రెబల్ ఎమ్మెల్యే చేరికతో ఆ సంఖ్య పన్నెండుకు పెరిగింది. సంస్ధాగతంగా పార్టీ పటిష్టతకు, జిల్లా అభివృద్ధికి బాటలు వేసుకునే అవకాశం లభించింది. మంత్రివర్గ పునర్విభజన తర్వాత జిల్లాకు రెండు కీలకమైన పోర్ట్ ఫోలియోలు లభించాయి. గ్రామీణ అభివృద్ధి, ప్రజలతో నేరుగా సంబంధాలు వుండే మంత్రిత్వ శాఖలు కావడంతో నాయకత్వంలోనూ కొత్త ఆశలు చిగురించాయి. కానీ… క్షేత్ర స్ధాయిలో…