“రాక్షసుడు” సీక్వెల్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సైకో థ్రిల్లర్ మూవీ “రాక్షసుడు” బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తమిళ హిట్ మూవీ “రాట్చసన్”కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్ గానూ, నటన పరంగానూ శ్రీనివాస్ కెరీర్ లో మర్చిపోలేని చిత్రంగా మిగిలింది. రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ మూవీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కొనేరు సత్యనారాయణ క్రైమ్ థ్రిల్లర్‌ను నిర్మించారు.…