శుక్రవారం నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహారాష్ట్రలో ఓటింగ్‌కు అర్హత సాధించిన మొత్తం 285 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్రలో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగగా.. బీజేపీ ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టగా, శివసేన ఇద్దరు, కాంగ్రెస్, ఎన్‌సీపీ ఒక్కొక్కరు చొప్పున అభ్యర్థులను నిలబెట్టడంతో పోటీ అనివార్యమైంది. మొత్తం ఆరు స్థానాలకు గానూ ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ నుంచి పీయూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ గెలుపొందారు.…
నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 57 సీట్లకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా.. 41 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 16 స్థానాలకు ఎన్నిక జరగనుంది. హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నిర్వహణకు ఈసీ ఎన్నికల పరిశీలకులను నియమించింది. ఎన్నికల ప్రక్రియను వీడియో తీయాలని ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న…