Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపింది. అరైవల్స్ వద్ద వదిలివేసిన బ్యాగ్‌ను గుర్తించిన సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగ్ కారణంగా కొంతసేపు ఎయిర్‌పోర్ట్‌లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించింది. తనిఖీల అనంతరం బ్యాగ్‌లో ఎలాంటి ప్రమాదకర పదార్థాలు లేవని తేలింది.
Hyderabad Airport: హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు ఉదయం భారీ ప్రమాదం తప్పింది. చెన్నై నుండి హైదరాబాద్‌కు వస్తున్న బ్లూడార్ట్ కార్గో విమానానికి ల్యాండింగ్ గేర్ సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు. వెంటనే ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పందించి ఇతర అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ను నిలిపివేశారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా, పైలట్ విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ చేయగలిగాడు. సమస్య తలెత్తిన సమయంలో కార్గో విమానంలో మొత్తం…
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో నాలుగు అంతర్జాతీయ విమానాలు ల్యాండింగ్ అయ్యాయి. అందుకు కారణం.. వాతావరణం అనుకూలించకపోవడం. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం అనుకూలించకపోవడం కారణంగా అక్కడికి వెళ్లే విమానాలను శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు దారి మళ్లించారు అధికారులు.
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో బాంబు ఉందంటూ సైబరాబాద్ కంట్రోల్ రూమ్‌కు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. అప్రమత్తమై ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది ముమ్మర తనిఖీలు చేశారు. ఎక్కడా ఏమీ లభ్యం కాలేదు. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని భద్రతా సిబ్బంది తేల్చింది. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని ఎయిర్‌పోర్ట్ అధికారులు కూడా ధ్రువీకరించారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి తెలంగాణలోని కామారెడ్డి వాసిగా ఎయిర్‌పోర్ట్ అధికారులు గుర్తించారు.…
జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా పోలీసులు, భద్రతా అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిఘా వర్గాలు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
Airbus Beluga: ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఎయిర్ బస్ బెలూగాగా పిలిచి ఈ తిమింగలం ఆకారంలో ఉండే ఈ విమానం ఇప్పటి వరకు 2 సార్లు హైదరాబాద్‌కి రాగా, ఇది మూడోసారి. శుక్రవారం తెల్లవారుజామున 12.17 గంటలకు శంషాబాద్‌లో విమానం దిగింది. అంతకుముందు డిసెంబర్ 2022, ఆగస్టు 2023లో ఈ విమానం ఇక్కడకు వచ్చింది.
Hyderabad airport: హైదరాబాద ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, బోయింగ్, ఎయిర్ బస్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్ దేశంలోనే నాలుగో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందుతోంది. ఫార్మా, ఐటీ, టెక్నాలజీలకు కేంద్రంగా ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల నుంచి హైదరాబాద్‌కి నేరుగా ఫ్లైట్స్ నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటంతో పాటు విదేశాల నుంచి నగరానికి వచ్చే వారి…
Lufthansa Airlines: తెలుగు రాష్ట్రాల నుంచి జర్మనీ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కి డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభించింది. జనవరి 17 నుంచి ఈ ఫ్లైట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌ని ప్రపంచానికి అనుసంధానం చేయడం, వాణిజ్యం కోసం గ్లోబల్ హబ్‌గా మార్చడానికి ఇది సహకరిస్తుందని GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఓ ప్రకటనలో తెలిపింది.
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ప్రఖ్యాత ఏవియేషన్ ఎనలిటికల్ సంస్థ అయిన సీరియమ్ ద్వారా ఆన్- టైమ్ పని తీరు కోసం ప్రపంచ వ్యాప్తంగా రెండవ అత్యుత్తమ విమానాశ్రయంగా ర్యాంక్ సాధించింది.
Shamshabad Airport: భారతదేశంలోని విమానాశ్రయాలలో శంషాబాద్ విమానాశ్రయం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయ ప్రయాణికులకు రోబోల సేవలు అందుబాటులోకి రానున్నాయి.