తెలుగు ప్రేక్షకుల కోసం బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ మరోసారి తెరపై మెరవడానికి సిద్ధంగా ఉన్నారు. అఖీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘త్రిముఖ’ చిత్రంలో ఆమె ఓ స్పెషల్ ఐటెం సాంగ్‌లో నటించారు. ఈ చిత్రానికి రాజేష్ నాయుడు దర్శకత్వం వహించగా, డాక్టర్ శ్రీదేవి మద్దాలి, డాక్టర్ రమేష్ మద్దాలి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాలో “గిప్పా గిప్పా” అనే ఐటెం సాంగ్ ఇటీవలే గ్రాండ్‌గా షూట్ పూర్తయింది. యోగేష్ కల్లే, సన్నీ లియోన్,…