Disco Dancer : ఇప్పుడంటే అన్నీ పాన్ ఇండియా సినిమాలే. ప్రతి సినిమాకు ఈజీగా వెయ్యి కోట్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడున్న రేట్లు, సినిమా ప్రేక్షకుల సంఖ్యను బట్టి అదేమంత పెద్ద విషయం కాదు. అయితే ఇండియాలో తొలిసారి వంద కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా.. బాహుబలి, దంగల్, రోబో అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఇవేవీ రాకముందే ఓ సినిమా వంద కోట్లు వసూలు చేసి అప్పట్లోనే ఇండియాను షేక్ చేసింది. ఆ సినిమా పేరు…
హిందీ సినిమా కథలు తెలుగులోనూ, తెలుగు సినిమా కథలు హిందీలోనూ రీమేక్ అయిన సందర్భాలు బోలెడున్నాయి. ఇప్పుడే కాదు, భారతీయ సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లోనే ఈ పంథా సాగాంది. యన్టీఆర్ హీరోగా తెలుగులో రూపొందిన ‘కథానాయకుడు’ చిత్రం హిందీలో రాజేశ్ ఖన్నాతో ‘అప్నా దేశ్’గా రీమేక్ అయి విజయం సాధించింది. రాజేశ్ ఖన్నా హీరోగా రూపొందిన కొన్ని చిత్రాల ఆధారంగా తెలుగులో యన్టీఆర్ హీరోగా సినిమాలు తెరకెక్కి విజయం సాధించాయి. రాజేశ్ ఖన్నా హీరోగా రూపొందిన…
రాజేశ్ ఖన్నాను ఇప్పటికీ హిందీ చిత్రసీమలో “ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా” అంటూ కీర్తిస్తుంటారు. అంటే అంతకు ముందు హిందీ సినిమా రంగంలోని దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్ వంటి స్టార్స్ ‘సూపర్ స్టార్స్’ కాదా అన్న అనుమానం కలుగక మానదు. అంతకు ముందు స్టార్ హీరోస్ కు రాజేశ్ ఖన్నాకు తేడా ఉంది. అదేంటంటే, రాజేశ్ కంటే ముందు స్టార్ డమ్ చూసిన వారంతా ముందు తమ సత్తా నిరూపించుకున్న తరువాతే…
బాలీవుడ్ లో సూపర్ స్టార్ అన్న పేరు వినిపించగానే ఈ తరం వారికి షారుఖ్ నుంచీ రణబీర్ దాకా బోలెడు మంది హీరోలు గుర్తుకు వస్తారు. కానీ, నిన్నటి తరం వార్ని సూపర్ స్టార్ అని అడిగితే అమితాబ్ బచ్చన్ పేరు చెబుతారు. ఇంకా ముందు తరం వార్ని అడిగితే రాజేశ్ ఖన్నా అంటారు! నిజానికి ఆయనకు ‘ఒరిజినల్ సూపర్ స్టార్ ఆఫ్ బాలీవుడ్’ అనే టైటిల్ కూడా ఉంది!రాజేశ్ ఖన్నా సూపర్ స్టార్ గా ఓ…