ఈ యేడాది లాస్ట్ వీకెండ్ లో ఏకంగా పది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఎనిమిది స్ట్రయిట్ సినిమాలు కాగా రెండు అనువాద చిత్రాలు. ఇందులో అనుపమా పరమేశ్వరన్ నటించిన 'బట్టర్ ఫ్లై' మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
సాయి రోనక్ హీరోగా రామ్ గణపతి దర్శకత్వంలో మణి లక్ష్మణ్ రావ్ నిర్మించిన సినిమా 'రాజయోగం'. అరుణ్ మురళీధరన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కు ఎం.ఎం. శ్రీలేఖ ట్యూన్ ఇవ్వడం విశేషం.