దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటించిన తొలి చిత్రం 'అహింస' మరోసారి వాయిదా పడేట్టుగా ఉంది. ఈ శుక్రవారం 'రావణాసుర, మీటర్' చిత్రాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ దీనిని వాయిదా వేశారని తెలుస్తోంది.
దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ తేజ తెరకెక్కించిన 'అహింస' మూవీ ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. అయితే ఇప్పటికే ఆ తేదీన రవితేజ 'రావణాసుర', కిరణ్ అబ్బవరం 'మీటర్' చిత్రాలు విడుదల కాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.