రాజస్థాన్లో ఇప్పటి నుంచి మృతదేహాలను రోడ్డుపై ఉంచి నిరసన తెలిపితే శిక్ష అనుభవించాల్సందే. అందుకోసం కఠినమైన చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టానికి సంబంధించి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం 3 రోజుల క్రితం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు పేరు 'రాజస్థాన్ డెడ్ బాడీ రెస్పెక్ట్ బిల్ 2023'. ఇది ఇప్పుడు చట్టం రూపంలోకి వస్తుందని.. మృతదేహానికి గౌరవం ఇవ్వడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆ ప్రభుత్వం తెలుపుతుంది.
అక్రమ సంబంధాలు జీవితాలను నాశనం చేస్తాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో దారుణ ఘటనలను చూస్తూనే ఉన్నాం..తాజాగా ఓ వివాహేతర సంబంధం మనిషి ప్రాణాన్ని తీసింది.. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది..రాజస్థాన్ లోని పాలిలో 33 ఏళ్ల వ్యక్తిని అతని భార్య ప్రేమికుడు హత్య చేసి, మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికి, వేర్వేరు ప్రదేశాల్లో పాతిపెట్టాడు. శరీరభాగాలను ఖననం చేసిన స్థలంలో నిందితుడు మామిడి మొక్కను నాటినట్లు పోలీసులు తెలిపారు. జోగేంద్ర అనే వ్యక్తిని…
రాజస్థాన్లో దారుణ ఘటన వెలుగు చూసింది. 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు, ఆమె మీద యాసిడ్ దాడి చేశారు. ఆ తరువాత ఆమె మృతదేహం ఓ బావిలో దొరికింది. ఈ ఘటన రాజస్థాన్లో కరౌలీ జిల్లాలో జరిగింది.
స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. ప్రతి ఒక్కరి నట్టింట్లోకి వచ్చింది.. చివరికి బెడ్రూమ్.. బాత్రూమ్లోకి సైతం చేరింది. స్మార్ట్ ఫోన్ను ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉపయోగించుకుంటున్నారు.
BJP: 2024 లోక్ సభ ఎన్నికలు, ఈ ఏడాది జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది.
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో ఓ గ్యాంగ్స్టర్ హత్య జరిగింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు భద్రత నడుమ తీసుకెళ్తున్న క్రమంలో కొంతమంది పోలీసులు కళ్లలో కారం కొట్టి గ్యాంగ్స్టర్ ని కాల్చి చంపారు. బుధవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే హత్య కేసులో నిందితులుగా ఉన్న కల్దీప్ జఘీనా, విజయపాల్ అనే ఇద్దరు నిందితులను ఏడుగురు పోలీసులు బస్సులో జైపూర్ నుంచి భరత పూర్ తీసుకెళ్లుతున్న సమయంలో 8 మంది వ్యక్తులు బస్సును…
Lose Eyesight: రాజస్థాన్ రాష్ట్రంలో 18 మంది కంటి చూపును కోల్పోయారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ఆస్పత్రి అయిన సవాయ్ మాన్ సింగ్ (ఎస్ఎంఎస్) ఆస్పత్రిలో ఆపరేషన్ తర్వాత ఈ 18 మంది కంటి చూపును కోల్పోయినట్లు ఆరోపిస్తున్నారు.
రాజస్థాన్లో సినీ ఫక్కీలో ఓ నిందితుడి హత్య జరిగింది. చాలా సినిమాల్లో ఇలాంటి ఘటనలు చూసే ఉంటాం. నిందితుడు ఓ కేసులో ఇరుక్కుంటే.. అతడి వల్ల వారు పట్టుబడుతారేమోనని పోలీసుల ఎదుటే చంపేస్తారు. అలాంటి ఘటనే తాజాగా రాజస్థాన్లో జరిగింది.
ఓం సింగ్ రాథోడ్ ఆత్మ బుల్లెట్ బైకు మీద తిరుగుతుందని స్థానికులు అనుకున్నారు.. దీంతో ప్రమాదం జరిగిన స్థలాంలోనే గుడి కట్టారు. ఆ ప్రదేశంలో బుల్లెట్ బైకుకి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. బుల్లెట్ బైక్ కు ఓం సింగ్ రాథోడ్ గౌరవార్థం 'బుల్లెట్ బాబా' అని నామాకరణం చేశారు. ప్రతి రోజూ ఎంతో మంది భక్తులు ఈ గుడిని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు.
Heavy Rains: ఉత్తర భారతదేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.