అక్రమ సంబంధాలు జీవితాలను నాశనం చేస్తాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో దారుణ ఘటనలను చూస్తూనే ఉన్నాం..తాజాగా ఓ వివాహేతర సంబంధం మనిషి ప్రాణాన్ని తీసింది.. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది..రాజస్థాన్ లోని పాలిలో 33 ఏళ్ల వ్యక్తిని అతని భార్య ప్రేమికుడు హత్య చేసి, మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికి, వేర్వేరు ప్రదేశాల్లో పాతిపెట్టాడు. శరీరభాగాలను ఖననం చేసిన స్థలంలో నిందితుడు మామిడి మొక్కను నాటినట్లు పోలీసులు తెలిపారు.
జోగేంద్ర అనే వ్యక్తిని హత్య చేసి, మొండెంను సమీపంలోని అడవిలో పాతిపెట్టాడు. ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్న తోటలో తల, చేతులు, కాళ్లు పాతి పెట్టాడు.నిందితుడు జోగేంద్ర శరీర భాగాలను ఖననం చేసిన స్థలంలో మామిడి మొక్కను నాటినట్లు పోలీసులు వెల్లడించారు.. బయటకు వెళ్ళిన కొడుకు ఎప్పటికి తిరిగి రాకపోవడంతో జోగేంద్ర తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు..దాంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..
కొడుకు కనిపించకుండా పోవడంలో మదన్‌లాల్ ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తం చేశాడు. నా కొడుకును చంపడంలో మరికొంత మంది ప్రమేయం కూడా ఉందని నేను నమ్ముతున్నాను అని మృతుడి తండ్రి మిశ్రలాల్ మేఘ్వాల్ అన్నారు… ఇక మదన్ లాల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో, జోగేంద్ర భార్యతో తనకు సంబంధం ఉందని మదన్ లాల్ ఒప్పుకున్నాడు.. మా ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నాడని అతన్ని హత్య చేసినట్లు మదన్‌లాల్ అంగీకరించాడు. నేరం ఎలా చేశాడనే వివరాలను కూడా చెప్పాడు.. అతను చెప్పిన వివరాల ప్రకారం శరీర భాగాలను తీశారు.. అనంతం పోస్ట్ మార్టం కు తరలించారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..