RRR దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మ్యాగ్నమ్ ఓపస్ విడుదలకు సిద్ధంగా ఉంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న RRR మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం టికెట్ల రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. “ఆర్ఆర్ఆర్” విడుదలైన మొదటి 10 రోజుల పాటు ప్రత్యేక టిక్కెట్ ధరలను నిర్ణయించడానికి అంగీకరించింది. అంతేకాదు తొలి పది రోజుల పాటు ఉదయం 7…
RRR మార్చి 25న గ్రాండ్ రిలీజ్ కాబోతోందన్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో మూవీ పెయిడ్ ప్రీమియర్లపై ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ‘RRR’ ప్రీమియర్ షోలను నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్ షోలకు సంబంధించి చిత్రబృందం అధికారుల నుంచి అనుమతులు కూడా పొందింది. అయితే తాజా బజ్ ప్రకారం RRR పంపిణీదారులు పెయిడ్ ప్రీమియర్లకు వ్యతిరేకత చూపుతున్నారని తెలుస్తోంది.…
RRR Dubai Press Meet తాజాగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి వచ్చిన రెస్పాన్స్ ను చూసి మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా ఓ వీడియోను విడుదల చేస్తూ “మా దుబాయ్ అభిమానుల నుండి ఎంతటి ఘన స్వాగతం! మేము భారతదేశంలో ఉన్నట్లు అనిపిస్తుంది… మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాము” అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో మన హీరోలు చెర్రీ, తారక్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తుండగా, అభిమానులు చేస్తున్న అల్లరి అంతా ఇంతా…
RRR ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉంది. RRR త్రయం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటికే సినిమా సెన్సార్ పూర్తయిన విషయం తెలిసిందే. అయితే మూవీ 3 గంటల కంటే ఎక్కువ రన్టైమ్తో ఉండగా, U/A సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం ఏకంగా ఒక్క రోజుకి 50 లక్షలు ఖర్చు చేశారట. అయితే ఇప్పుడు సినిమాలో ఆ సన్నివేశమే లేదని బజ్…
RRR Dubai Press Meet లో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జక్కన్న మ్యాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” మార్చ్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక సినిమా విడుదలకు ఎక్కువ రోజులు లేకపోవడంతో “ఆర్ఆర్ఆర్ ” టీం ప్రమోషన్లలో దూకుడును పెంచింది. తాజాగా ఐకానిక్ సిటీ దుబాయ్ లో ల్యాండైన “ఆర్ఆర్ఆర్” టీం అక్కడ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి పాల్గొన్నారు. ఇందులో…
RRR మూవీ టీం ఐకానిక్ సిటీలో ల్యాండ్ అయ్యారు. మరోవైపు మేకర్స్ అసలు ప్లాన్ రివీల్ చేశారు. మార్చి 25న సినిమా విడుదల కానున్న మాగ్నమ్ ఓపస్ మూవీ RRR ప్రమోషన్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం RRR బృందం చివరి దశ ప్రమోషన్లను ప్రారంభించింది. ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం దుబాయ్‌లో ల్యాండైన చిత్రబృందానికి సంబంధించిన పిక్స్ విల్ అవుతున్నాయి. రామ్ చరణ్ తన పెంపుడు కుక్క రైమ్‌తో కలిసి కన్పించగా, ఎన్టీఆర్, రాజమౌళి కూడా ఉన్నారు. మరోవైపు మేకర్స్…
Ram Charan మాతృభూమి కోసం సైనికుడిగా మారిన తన బాడీగార్డ్ కు ఓ స్పెషల్ హెల్ప్ చేశారు. ఇంత వరకూ చెర్రీకి బాడీ గార్డ్ గా ఉన్న రస్టీ ఉక్రెయిన్ కు చెందిన వాడు. గత కొన్ని రోజులుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు విడుస్తున్నారు. ఇక రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పౌరులు కూడా సైన్యంలో చేరాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పిలుపునిచ్చారు.…
ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం ఎక్కడ చూసినా రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రమే కనిపిస్తున్నారు. ఛానెల్ ఏదైనా, ఇంటర్వ్యూ మాత్రం వీరిదే.. స్పెషల్ ఇంటర్వ్యూస్ తో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తున్నారు. వీరికి యాంకర్స్ అవసరం లేదు.. ప్రత్యేకంగా ప్రమోట్ చేయడానికి న్యూస్ ఛానెల్స్ కి వెళ్లాల్సిన అవసరం లేదు.. ముగ్గురు.. ముగ్గురే.. అందుకే అంటారు ప్రమోషన్ల యందు జక్కన్న ప్రమోషన్స్ వేరయా అని.. గత కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో వీరి ముగ్గురు హంగామా మాములుగా లేదు.…
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. దీంతో ఈ సినిమాకు ప్రత్యేకంగా టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో విడుదల చేసింది. అన్ని థియేటర్లు ప్రతి టికెట్‌పై రూ.75 ధర పెంచుకోవచ్చని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ జీవో విడుదల చేశారు. సినిమా రిలీజ్ కానున్న ఈ నెల 25వ తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ ప్రత్యేక ధరలు…
మరో వారం రోజులకు జనం ముందు నిలవనుంది రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘ఆర్.ఆర్.ఆర్.’ కొన్ని దశాబ్దాల తరువాత తెలుగునాట వస్తోన్న అసలు సిసలు మల్టీస్టారర్ గా ‘ట్రిపుల్ ఆర్’ను కీర్తిస్తున్నారు. మాస్ లో విశేషమైన ఫాలోయింగ్ ఉన్న జూ.యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా ఈ నెల 25న సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలో ‘ట్రిపుల్ ఆర్’ మూవీ బడ్జెట్ ఎంత అన్న దానిపైనా సినీఫ్యాన్స్ లో విశేషంగా చర్చ…