కర్ణాటక మొత్తం ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ హంగామా కొనసాగుతోంది. చిక్ బళ్ల పూర్ లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ వేడుక జరుగుతున్న విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా జరుగుతున్నా ఈ వేడుకలో నిర్మాత డివివి దానయ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ” ఈ చిత్రానికి నిర్మాతగా మారడం ఎంతో ఆనందంగా ఉంది. ఇద్దరు స్టార్ హీరోలను కలిపే అదృష్టం రాజమౌళి నాకు ఇచ్చారు. అందుకు ఆయనకెప్పుడు ఋణపడి ఉంటాను. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
ఇక ఈ సినిమా కోసం టికెట్ రేట్స్ పెంచిన ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు టికెట్ రేట్స్ పెంచేలా జీవో ప్రకటించినందుకు కేసీఆర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక ఈ వేదికపై ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్స్ చెప్పాలి. ఆయన వలనే ఇదంతా జరిగింది. ఆయన పూనుకొని ఈ టికెట్ రేట్స్ గురించి మాట్లాడారు కాబట్టే మాకు ఈ వెసులుబాటు వచ్చింది. ఆయనే లేకపోతే వేరేలా ఉండేది.. ఆయనకు ఎన్నో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.