Pawan Kalyan to Meet Chandrababu in Rajahmundry Central jail: ఏపీ నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. రేపు రాజమండ్రికి జనసేనాని పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. రాజమండ్రి జైల్లో స్నేహ బ్లాక్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తో జనసేన అధ్యక్షుడు పవన్ ములాఖాత్ కానున్నారు. జైలులో ఇద్దరు అగ్రనేతలు కలవనున్న క్రమంలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయి అనేది హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబుకు మద్దతు తెలిపి, ధైర్యం చెప్పడానికి…
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఏపీ మాజీ ముఖ్యమంత్రిని పోలీసులు భారీ భద్రత నడుమ రోడ్డుమార్గంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
చంద్రబాబుకు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని ఏసీబీ కోర్టు జైలు అధికారులకు తెలిపింది. తగిన భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చేందుకు ఏసీబీ కోర్టు అంగీకరించలేదు. చంద్రబాబు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్న ఆయన న్యాయవాదుల విజ్ఞప్తికి ఏసీబీ కోర్టు సమ్మతి తెలిపింది.
డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబును గత నెల 23న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నారు. బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ జైలులో ఉన్నప్పటికీ రంపచోడవరం నియోజకవర్గంలో ఏ పనైనా ఆయన కనుసన్నల్లోనే జరుగుతోందట. నియోజకవర్గంలో మొత్తం 11 మండలాలు ఉన్నాయి. రాష్ట్ర విభజనప్పుడు తెలంగాణలోని పోలవరం ముంపు మండలాలు కొన్ని రంపచోడవరం నియోజకవర్గంలో కలిశాయి. రంపచోడవరం వ్యాప్తంగా తనకు నమ్మకంగా ఉన్న అనుచరులతో…
ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య.. ఏపీలో సంచలనం సృష్టించింది. హత్య కేసులో ఎమ్మెల్సీ పైనే అనుమానాలు వ్యక్తం చేశారు డ్రైవర్ కుటుంబ సభ్యులు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. కుటుంబసభ్యు లు, దళిత సంఘాల ఆందోళనలతో మూడు రోజులకు.. నాటకీయ పరిణామాల మధ్య ఈనెల 23న అనంత బాబును అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ విషయంలోనూ పెద్ద సస్పెన్స్ ధ్రిల్లర్ క్రియేట్ చేశారు. వైద్య పరీక్షలు, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం అంతా ఎమ్మెల్సీకి అనుకూలంగా…