ప్రముఖ నటి, మాజీ రాజ్యసభ, లోక్ సభ సభ్యురాలు జయప్రద ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు రాజబాబు (65) ఈరోజు (ఫిబ్రవరి 28) మధ్యాహ్నం అనారోగ్యంతో కన్నుమూశారు. రాజబాబు నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3.26 గంటలకు తుదిశ్వాస విడిచారు.
RajaBabu: నవరసాల్లో హాస్యాన్ని పండించడమే అసలైన పరీక్ష అంటారు నటీనటులు. కొందరు హాస్యాన్ని 'కత్తి మీద సాము'తోనూ పోలుస్తారు. కామెడీలో కాసింత ఎక్కువైనా కారంగా, వికారంగా ఉంటుదనీ ప్రతీతి.
(అక్టోబర్ 20న రాజబాబు జయంతి)“నవ్వు నాలుగందాల చేటు” అన్నది పాత సామెత, “నవ్వు నలభై విధాల గ్రేటు” అనేది నా మాట – అంటూ రాజబాబు తన నవ్వుల పువ్వులతో తెలుగువారికి హాస్యసుగంధాలు అందించారు. రాజబాబు తెరపై కనిపించగానే ప్రేక్షకుల పెదాలు నవ్వడానికి విచ్చుకొనేవి. ఇక ఆయన మెలికలు తిరిగే హాస్యాభినయం జనానికి కితకితలు పెట్టేది. ఒకానొక దశలో తెలుగు సినిమా కమర్షియల్ ఫార్ములాగా రాజబాబు కామెడీ నిలచింది. నాటి టాప్ స్టార్స్ కు సమానంగా పారితోషికం…