తాజాగా విడుదలైన తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమా చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆ ట్రామా మర్చిపోయి ఊపిరి పీల్చుకుంటున్నారు. అదేంటి, తేజ సినిమా చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవడం ఏంటి అని మీకు అనుమానం కలగవచ్చు. అసలు విషయం ఏమిటంటే, తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమా కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత విశ్వప్రసాద్ స్వయంగా ఒక సీజీ కంపెనీ ప్రారంభించారు. ప్రొడక్షన్ కాస్ట్స్ తగ్గించుకునే పనిలో భాగంగా, ఆయనకు ఉన్న టెక్నికల్ స్కిల్స్…