తాజాగా విడుదలైన తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమా చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆ ట్రామా మర్చిపోయి ఊపిరి పీల్చుకుంటున్నారు. అదేంటి, తేజ సినిమా చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవడం ఏంటి అని మీకు అనుమానం కలగవచ్చు. అసలు విషయం ఏమిటంటే, తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమా కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత విశ్వప్రసాద్ స్వయంగా ఒక సీజీ కంపెనీ ప్రారంభించారు. ప్రొడక్షన్ కాస్ట్స్ తగ్గించుకునే పనిలో భాగంగా, ఆయనకు ఉన్న టెక్నికల్ స్కిల్స్ వాడుకొని ఒక సీజీ కంపెనీ సెటప్ చేశారు. ఈ కంపెనీే ‘మిరాయ్’ సినిమాకి సంబంధించిన సీజీ వర్క్స్ మొత్తం చూసుకుంది.
Also Read: iPhone 16 Pro Price: యాపిల్ లవర్స్ ఎగిరి గంతేసే న్యూస్.. ఐఫోన్ 16 ప్రోపై రూ.43 వేల తగ్గింపు!
ఇక ఈరోజు రిలీజ్ అయిన ‘మిరాయ్’ సినిమా చూసిన తర్వాత, ఆ సీజీ వర్క్స్, సీజీ వర్క్స్ అవుట్‌ఫుట్ చూసిన తర్వాత తెలుగు సినీ ఆడియన్స్ హ్యాపీగా ఫీలయ్యారు. దానికి తోడు, సినిమాకి కేవలం 60 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించామని నిర్మాత చెప్పడంతో, అంత బడ్జెట్లో ఈ స్థాయి విజువల్స్ రాబట్టడం మామూలు విషయం కాదని అంటున్నారు. అయితే, ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ సినిమా నిర్మాత కూడా టీజీ విశ్వప్రసాద్. ఆయన ‘రాజా సాబ్’ సినిమా సీజీ వర్క్స్ కూడా ఇదే కంపెనీతో చేయిస్తున్నారు. కాబట్టి, ఇప్పటివరకు ‘రాజా సాబ్’ సినిమా విషయంలో ఉన్న అనుమానాలన్నీ ఈరోజు రిలీజ్ అయిన ‘మిరాయ్’ సినిమా క్లియర్ చేసిందన్నమాట. ఈ దెబ్బతో ప్రభాస్ అభిమానులు అందరూ ఆ విషయంలో ఊపిరి పీల్చుకుంటున్నారు.