ప్రేమ పేరుతో దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. ప్రేమ, పెళ్లి పేరుతో అమాయకపు యువతులను లోబర్చుకుని ప్రాణాలు తీస్తున్నారు. చంపడానికి కూడా వెనకాడడం లేదు. ఈ క్రమంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు సచివాలయ ఉద్యోగి రాజారావు. అంతేకాదు. యువతిని వదిలించుకునేందుకు జనవరి 15న ఎలుకల మందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించి రాక్షసత్వం ప్రదర్శించాడు రాజారావు. తనను మోసం చేసిన సచివాలయ ఉద్యోగి రాజారావుపై భాదితురాలు…