బ్రహ్మ ఆనందం అనే పేరుతో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే ఈ సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో, ఆయన కొడుకు రాజా గౌతమ్ మనవడిగా నటించారు. వెన్నెల కిషోర్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో సినిమా మీద అంచనాలను పెంచింది. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టీమ్ వెల్లడించింది. ఆహా వేదికగా ఇది…
మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హ్యాట్రిక్ హిట్ల తరువాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రం ఫిబ్రవరి 14న రాబోతోంది. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు.…
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా రూపొందుతున్న సినిమా గ్లిమ్స్‌ను అతని బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక ముద్రను వేసుకున్న యస్ ఒరిజినల్స్ బ్యానర్ నుండి ప్రొడక్షన్ నెం 10గా నిర్మిస్తున్న ఈ సినిమాతో సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ పోస్టర్‌ను గౌతమ్ క్యారెక్టర్‌లోని పెయిన్‌ను తెలియచేసే విధంగా చిత్ర యూనిట్ డిజైన్ చేసింది. నటుడిగా ‘మను’తో సర్ ప్రైజ్ చేసిన గౌతమ్ ఈసారి…