Uddhav Thackeray: శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే శనివారం తన విడిపోయిన బంధువు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌ఠాక్రేతో 20 ఏళ్ల తర్వాత మొదటిసారిగా వేదిక పంచుకున్నారు. ఉప్పునిప్పులా ఉండే వీరిద్దరు తమ విభేదాలను పక్కన పెట్టి కలిశారు. ‘‘మేము కలిసి వచ్చాము, కలిసి ఉంటాము’’ అంటూ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యయనం వెలుగుచూసింది. దాయాదులుగా ఉన్న అన్నాదమ్ముళ్లిద్దరూ 20 సంవత్సరాల తర్వాత ఒక్కటయ్యారు. మరాఠీ భాష కోసం ఒకే వేదిక పంచుకున్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లోనే ఇది సరికొత్త చరిత్రగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
Raj Thackeray: భారతీయ జనతా పార్టీపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్‌ఠాక్రే హాట్ కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్, ఠాక్రే బ్రాండ్లను అంతం చేసేందుకు కమలం పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Nitesh Rane: మహారాష్ట్రలో జాతీయ విద్య విధానం(ఎన్ఈపీ) అమలులో భాగంగా మరాఠీ, ఇంగ్లీష్‌తో పాటు హిందీని తప్పనిసరి చేయడాన్ని రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ పార్టీతో పాటు ఉద్ధవ్ ఠాక్రే శివసేన యూబీటీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ వివాదమే, ఇప్పుడు మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామాలకు కారణమవుతోంది.
Sanjay Raut: మహారాష్ట్రలో ‘‘హిందీ వివాదం’’ నేపథ్యంలో విడిపోయిన రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు కలిసి పోతున్నారనే టాక్ నడుస్తోంది. ఇటీవల, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. తనకు ఉద్ధవ్‌కి మధ్య ఉన్నవి చిన్న విభేదాలే అని, మహారాష్ట్ర ప్రయోజనాలు పెద్దవి అంటూ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం విభేదాలను పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు.
Maharashtra: జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలు, హిందీ వివాదంపై తమిళనాడు, కర్ణాటక తర్వాత మహారాష్ట్రలోని పొలిటికల్ పార్టీలు కూడా ఈ వివాదంలో చేరాయి. మహారాష్ట్రంలో హిందీ వివాదం నేపథ్యంలో ఠాక్రే కుటుంబాల మధ్య సయోధ్య కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేల మళ్లీ కలిసిపోయేందుకు మార్గం సుగమం అయింది. మరాఠీ గుర్తింపు, సంస్కృతికి ముప్పు ఉందనే ఆందోళనల మధ్య విడిపోయిన ఇద్దరు నేతలు నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి.
ఔరంగజేబుపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబు చరిత్ర తెలుసుకోవాలంటే వాట్సప్‌లో కాదని.. పుస్తకాలను చదవి చరిత్ర తెలుసుకోవాలని సూచించారు.
Devendra Fadnavis: మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం సాధించి, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కీలకంగా మారాయి. ఠాక్రేలతో బీజేపీకి ఉన్న సంబంధాల గురించి ఆయన వ్యాఖ్యానించారు. ‘‘గతంలో ఉద్ధవ్ ఠాక్రే ఒక స్నేహితుడు, ఇప్పుడు రాజ్‌ఠాక్రే స్నేహితుడు, కానీ ఉద్ధవ్ ఠాక్రే శత్రువు కాదు’’ అని అన్నారు.
Maharashtra Elections 2024: నవంబర్ 13న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ప్రారంభించాయి. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే పార్టీ శివసేన కూడా 45 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి పేరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఉండగా.. ఆయన ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి – పచ్‌పఖాడి స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అలాగే, రాజ్…
Raj Thackeray: ప్రధాని నరేంద్రమోడీ లేకుంటే సుప్రీంకోర్టు ఆదేశించినా కూడా అయోధ్యంలో రామమందిర నిర్మాణం జరగకపోయేదని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే శనివారం అన్నారు.