ఈ వారం ఉగాది రోజున ఐదు సినిమాలు విడుదల కాబోతుండగా, శుక్రవారం మరో మూడు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. అనువాద చిత్రాలతో కలిసి థియేటర్లలో సందడి చేయబోతున్న వీటిలో దేనికి ప్రేక్షకుడు పట్టం కడతాడో చూడాలి.
ప్రముఖ సంగీత దర్శకుడు, స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ స్వరాలు సమకూర్చిన చిత్రం 'రాజ్ కహాని'. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలో జనం ముందుకు రానుంది.