CM KCR Clarity on Rythu Bandhu: రైతులుకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్. బుధవారం జగిత్యాల పర్యటనలో కీలక ప్రకటన చేశారు. ఇంకో 5-10 రోజుల్లో రైతుబంధు డబ్బులు పడతాయని కేసీఆర్ చెప్పారు. ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ ఉందని.. అందులో నిర్ణయం తీసుకుని రైతుబంధు డబ్బులను విడుదల చేస్తామని అన్నారు. తెలంగాణ రైతాంగం అద్భుతమైన రైతుగా తయారయ్యే వరకు, కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు, రైతుబీమా ఆగదని ఆయన అన్నారు.