పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం ‘రైతన్న’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆదివారం రైతు నాయకుల కోసం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో దీనిని ప్రదర్శించారు. ‘రైతన్న’ సినిమాను వీక్షించిన వారిలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోదండ రెడ్డి, సీపిఐ నాయకులు చాడా వెంకట్ రెడ్డి, సిపీఎం నాయకులు మధు, టిఆర్ఎస్ నాయకులు…