పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అల్పపీడనం పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ రేపటికి ఉత్తర తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్తుందని పేర్కొంది. దీని ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు 4 రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు.…
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. తాజా పరిస్థితులపై భారత వాతావరణ శాఖ రిపోర్ట్ విడుదల చేసింది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా తీవ్ర అల్పపీడనంగా మారింది.. ఇది, ఆంధ్రప్రదేశ్‌కు ముప్పుగా మారుతోంది. తమిళనాడు తీరానికి చేరువగా వచ్చి దిశను మార్చుకుంటుందని.. ఆ తర్వాత ఏపీ తీరం వెంబడి బలమైన ఈదురు గాలులతో పయనిస్తుందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ వుంది.
వైజాగ్‌లో డ్రగ్స్ వ్యవహారం అప్పట్లో కాకరేపింది.. అయితే, విశాఖలో డ్రగ్స్ వ్యవహారంపై నేను మళ్లీ కేంద్రానికి లేఖ రాస్తున్నాను అన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తాను అన్నారు.. కేంద్ర దర్యాప్తు సంస్థలు మేనేజ్‌కు గురైతే మన పరువు పోతుందన్నారు.. అందుకోసం సిట్ రిపోర్ట్ ను బహిర్గతం చేయాలని లేఖ రాస్తానని వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫెంగల్’ తుపాన్ పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో తీరం దాటినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. తుపాన్ పశ్చిమ-నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ.. క్రమంగా బలహీన పడనుంది. తుపాన్ ప్రభావంతో ఈరోజు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర అంతటా వర్షాలు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తుఫాన్ వల్ల…
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడూ స్పెషల్ సీఎస్ సిసోడియా పర్యవేక్షిస్తున్నారు. భారీ నుంచి అతిభారీ వర్షాల నేపథ్యంలో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల కలెక్టర్లకు ఆయన సూచనలు చేశారు.
వాతావరణం అన్నాక మార్పులు సహజం. కానీ అసహజ ధోరణులు పుట్టి ముంచుతున్నాయి. ఒక వైపు వరదలు.. మరోవైపు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు. టోటల్‌గా అసాధారణ వాతావరణం అందర్నీ వణికిస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లు అసాధారణ వర్షాలు.. వాన వెలిసిన వెంటనే మాడు పగిలేలా ఎండలు. ఏం వచ్చినా పట్టలేం అన్నట్టుగా ఉంది వాతావరణం పోకడ. ఈ మధ్య కాలంలో ఈ అపరిచిత ధోరణులు బాగా పెరిగాయి. ఎంత సాంకేతికత ఉన్నా.. వాతావరణాన్ని అంచనా వేయడం వీలుకావడం…
విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారు.. వారి కష్టాలు వర్ణనాతీతం.. వారి మాటలు విటుంటే నాలుగురోజుల నుండి వాళ్లు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుంది.. కనీసం పసిబిడ్డలకు పాలు కూడా అందలేదు.. రోజుల తరబడి మంచి నీళ్లు కూడా అందలేదు అన్నారు..
సూర్యాపేట జిల్లాలో వరద పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారుల నివేదిక ప్రకారం 30 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు. ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరిగిందని.. ప్రజలకు విశ్వాసం కలిగించేందుకే తన పర్యటన అంటూ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాథమికంగా నష్టాన్ని అంచనా వేశారని, నివేదిక సమర్పించారని సీఎం తెలిపారు.