మండుటెండల్లో వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఏపీలో హిందూపురం, పరిగి, కదిరి మండలాల్లో వర్షం కురుస్తోంది. అనంతపురం, గుత్తి మండలంలో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది. Also Read:Ramagiri MPP Election: ఎంపీపీ ఇస్తామంటూ టీడీపీ నేతలు ప్రలోభ పెట్టారు.. వీడియో రిలీజ్ చేసిన ఎంపీటీసీ! అనంతపురం జిల్లాలో రాత్రి…
Heavy Rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షం కురుస్తుంది. విజయవాడ సహా పలు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అకాల వర్షం పడుతుంది. గన్నవరం, నందిగామ, తిరువూరు, చందర్లపాడు మండలంలోని ఏటూరు గ్రామంలో వినాయకుని దేవాలయంలో ఈదురు గాలులకు ధ్వజస్తంభం నేలకొరిగింది.
Heavy Rain In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో పాటు భారీగా ఈదురు గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో భారీ భారీ చెట్లు కుప్పకూలిపోయాయి.
భారతదేశం వ్యవసాయాధారిత దేశం. ఎక్కువమంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. పంటలు సమృద్ధిగా పండాలంటే వర్షాలే ఆధారం. సమయానికి వర్షాలు కురిస్తేనే అన్నదాత కళ్లల్లో ఆనందం నిండుతుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రైతన్నలకు గుడ్ న్యూస్ అందించింది. మాన్‌సూన్ అప్‌డేట్ అందించింది. ఈ సంవత్సరం జోరుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. IMD అంచనా ప్రకారం.. ఈసారి రుతుపవనాలు సగటు కంటే 105 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు చేస్తాయని అంచనా వేసింది. లడఖ్, ఈశాన్య, తమిళనాడులలో…
తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ద్రోణి ప్రభావంతో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. బలమైన ఈదురుగాలులతో.. ఉరుములు, మెరుపులతో వర్షాలు బీభత్సం సృష్టించాయి. మండు వేసవిలో వర్షాలు కురవడంతో ప్రజలు ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. అయితే అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికి వచ్చిన పంట నీటిపాలవడంతో కన్నీరు పెడుతున్నారు. ఇప్పుడు మళ్లీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. రాగల రెండు గంటల్లో హైదరాబాద్ తో పాటు…
రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. వాతావరణ అనిశ్చితి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..
హైదరాబాద్ లో అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. బలమైన ఈదురు గాలులు వీస్తూ బీభత్సం సృష్టించాయి. కారుమబ్బులు ఆవరించి కుండపోత వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. భారీగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరంలో వర్షంధాటికి చారిత్రక కట్టడం చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. భాగ్యలక్ష్మి దేవాలయం వైపున ఉన్న మినార్‌లో పై కప్పు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.…
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షం, ఈదురుగాలులతో రాజధాని హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.…
ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. జీహెచ్ ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎర్రమంజిల్ ప్రాంతంలో చెట్టు కూలడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ ఐఆర్టి టీమ్స్ వాటిని క్లియర్ చేసింది. సెక్రటేరియట్, రాజ్ భవన్ రోడ్, మసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాలతో…
పశ్చిమ మధ్య, దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి ఈ అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటలలో నైరుతి బంగాళాఖాతం, దానిని నానుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవనున్నాయి. నేడు అల్లూరి అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో ఒకటి రెండు…