బీహార్‌లోని అరా రైల్వే స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం ముగ్గురు మృతి చెందారు. 16 ఏళ్ల బాలికను, ఆమె తండ్రిని ఒక వ్యక్తి కాల్చి చంపాడు. దీని తర్వాత నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. అరా రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 2, ప్లాట్‌ఫామ్ నంబర్ 3 లను కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఈ సంఘటన జరిగింది. కాల్పులు జరిపిన వ్యక్తిని అమన్ కుమార్‌గా గుర్తించినట్లు భోజ్‌పూర్ జిల్లా…