రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చాలాసార్లు ప్రయాణీకుల ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది. ఆ పరిస్థితిలో వారికి ఏమి చేయాలో అర్థం కాదు. రైలులో ప్రయాణించేటప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చినట్లయితే.. మీకు అత్యవసర పరిస్థితుల్లో సహాయపడే ఓ నెంబర్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రైలు వెళ్తున్నప్పుడు అనారోగ్యంగా అనిపిస్తే ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీరు 139 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా తక్షణ సహాయం పొందవచ్చు.