బంగాళఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓమోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణలో వానలు పడుతున్నాయి. అటు ఏపీలోనూ పలుచోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు…