KTR Tweet: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘ఉద్యోగ క్యాలెండర్’పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు స్పందించారు. ఉద్యోగాలపై ఇచ్చిన హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడ్డారు.
Shivraj Chouhan: రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాభారతాన్ని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీని పరోక్షంగా విమర్శించారు. శుక్రవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ‘‘ అతను (రాహుల్ గాంధీ) శకుడి పాచికల చక్రవ్యూహాన్ని గుర్తుచేసుకున్నాడు.
Kangana Ranaut: బడ్జెట్ తయారు చేస్తున్న సమయంలో హల్వా వేడుకల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారు లేరని ఇటీవల లోక్‌సభలో రాహుల్ గాంధీ ‘దేశ్ కా హల్వా’ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఘాటు గానే స్పందించింది. కాంగ్రెస్ హయాంలో బడ్జెట్ తయారీ సమయంలో ఎంతమందికి చోటిచ్చారని ప్రశ్నించింది.
Sanjay Raut: రాహుల్ గాంధీపై దాడి జరుగొచ్చని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ శుక్రవారం అన్నారు. రాహుల్ గాంధీ మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్న వారందరిపై కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్లో 'చక్రవ్యూహం' ప్రసంగం తర్వాత తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేయాలని యోచిస్తోందని తెలిపారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఇటీవల ఉత్తరప్రదేశ్ పర్యటనలో చెప్పులు కుట్టే వ్యక్తిని కలిశారు. ఈ సందర్భంగా అతడి సాధకబాధకాలు తెలుసుకున్నాక.. చెప్పులు తీసుకుని రాహుల్ కుట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాదు.. అతడు కూడా భలే ఫేమస్ అయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
కేరళ విలయం తన దృష్టిలో జాతీయ విపత్తు అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం సోదరి ప్రియాంకాగాంధీతో కలిసి రాహుల్ వయనాడ్ ప్రకృతి విపత్తు జరిగిన ప్రాంతాలను సందర్శించారు.
Wayanad Landslide: ప్రకృతి అందాలకు నెలవైన కేరళ ఇప్పుడు వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనతో మృతుల దిబ్బగా మారింది. జిల్లాలోని ముండక్కై, చూరల్మల ప్రాంతాల్లో ల్యాండ్ స్లైండింగ్ మూలంగా విపత్తు సంభవించింది. మరణాల సంఖ్య 200ని దాటింది. టీ తోటల్లో పనిచేసే 600 మందికి పైగా కార్మికుల జాడ తెలియడం లేదు. భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ కార్యక్రమాలు చేపడుతున్నారు.
Lanka Dinakar: ఏపీ పునర్విభజన చట్టాన్ని చెల్లని చెక్కులాగా కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తే ఆ తప్పును బీజేపీ సవరించి నిధులు ఇస్తుంది అని ఏపీ భారతీయ జనాతా పార్టీ ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. తల్లి కాంగ్రెస్ చక్రవ్యూహ కబంధ హస్తాలలో రాష్ట్రం నలిగింది.. పిల్ల కాంగ్రెస్ చక్రబంధనంతో రాష్ట్రం రెక్కలు విరిగాయని ఆరోపించారు.