విదేశీ టీ-షర్టు ధరించి దేశాన్ని ఏకం చేసే భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బయలుదేరారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. 'భారత్ జోడో యాత్ర'లో ద్రవ్యోల్బణం అంశాన్ని లేవనెత్తిన రాహుల్ గాంధీ.. స్వయంగా రూ. 41,257 విలువ చేసే టీషర్ట్‌ను ధరించారని, అది కూడా విదేశీ బ్రాండ్‌కు చెందినదని పేర్కొంటూ బీజేపీ శుక్రవారం సోషల్ మీడియాలో కాంగ్రెస్‌పై దాడి చేసింది.