Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విదేశాల్లో భారత ప్రజాస్వామ్యంపై విమర్శలు చేశారు. కొలంబియాలోని ఈఐఏ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థులతో మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంపై దాడి భారత్‌కు అతిపెద్ద ముప్పు అని అన్నారు. భారత్‌లో అనేక మతాలు, సంప్రదాయాలు, భాషలు ఉన్నాయని, ప్రజాస్వామ్య విధానం అందరికి స్థానం కల్పిస్తుందని, కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థపై అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.