ప్రధాని మోడీ అత్యవసర కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు. కాసేపట్లో మోడీ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటన కోసం మంగళవారం జెడ్డా వెళ్లారు. వాస్తవానికి తిరిగి బుధవారం రాత్రికి ఢిల్లీకి చేరుకోవాలి.
పహల్గామ్ ఉగ్రదాడిని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాహుల్‌గాంధీ మాట్లాడారు.