బీహార్‌లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు వరకు జరగనుంది. ఇదిలా ఉంటే ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్ నమోదైంది. క్రమక్రమంగా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు.
జంగిల్ రాజ్ పాలనలో బీహార్‌లో అభివృద్ధి శూన్యమని.. మళ్లీ ఆ రోజులు ఎవరూ కోరుకోవద్దని ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీహార్‌లో రెండు విడతలో జరిగే నియోజకవర్గాల్లో గురువారం మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్జేడీ నేతృత్వంలోని విపక్ష కూటమిపై విరుచుకుపడ్డారు.
బీహార్‌లో తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 13.13 శాతం ఓటింగ్ నమోదైనట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. ఇక ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు.
బీహార్‌లో తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తొలి విడతలో భాగంగా 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటుండగా.. 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
బీహార్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మొత్తం 243 నియోజకవర్గాలు ఉండగా.. మొదటి విడతగా 121 నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ జరుగుతోంది. మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.