‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంకితభావానికి మారు పేరు ద్రవిడ్. ఆటగాడిగా భారత జట్టు తరఫున ఇది ఎన్నోసార్లు నిరూపించాడు. ఇప్పుడు కోచ్‌గానూ అదే నిబద్ధతను ప్రదర్శిస్తున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ద్రవిడ్.. గురువారం చేతి కర్రల సాయంతో టీమ్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. గాయమైన కాలికి స్పెషల్ బూట్ వేసుకుని.. కర్రల సాయంతో నడుచుకుంటూ మైదానంలోకి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను…