స్పెయిన్ బుల్, టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కెరీర్ ముగిసింది. డేవిస్ కప్ 2024లో నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ 2-1 తేడాతో ఓటమిపాలవ్వడంతో రఫా తన కెరీర్‌ను ముగించాడు. ముందుగా సింగిల్స్‌లో ఓడగా.. ఇప్పుడు నెదర్లాండ్స్ జట్టు ఓడిపోవడంతో నాదల్‌కు ఆడే ఛాన్స్ దొరకలేదు. డేవిస్ కప్‌తో ఆటకు వీడ్కోలు పలుకుతానని గత అక్టోబర్‌లోనే రఫా ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు దశాబ్దాలకు పైగా టెన్నిస్‌లో అద్వితీయ విజయాలు సాధించిన నాదల్.. తన పేరిట ఎన్నో రికార్డులు…
స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌తో పోటీ కారణంగానే తాను ఆటను మరింత ఆస్వాదించానని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తెలిపారు. రఫాది గొప్ప ప్రయాణం అని, 14 ఫ్రెంచ్ ఓపెన్‌లు గెలవడం చరిత్రాత్మకం అని ప్రసశంసించారు. స్పెయిన్ సహా మొత్తం టెన్నిస్ ప్రపంచం గర్వపడేలా చేశావని ఫెదరర్ పేర్కొన్నారు. డేవిస్‌కప్ తన కెరీర్‌లో చివరి టోర్నీ ప్రకటించిన నాదల్.. మంగళవారం తీవ్ర భావోద్వేగాల మధ్య బరిలోకి దిగాడు. క్వార్టర్ ఫైనల్స్ ఆరంభానికి కొన్ని గంటల ముందు ఫెదరర్…