Asim Munir: పాకిస్తాన్‌లో రాజకీయ అస్థిరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ యాక్టివ్‌గా మారారు. పౌర ప్రభుత్వాన్ని కాదని ఆయనే అన్ని దేశాల పర్యటకు వెళ్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అసలు నిజమైన పాలకుడా..? కాదా..? అనే సందేహాలు వస్తున్నాయి. ఇటీవల, షరీఫ్‌ని పక్కన పెట్టేందుకు మునీర్ ప్రయత్నిస్తు్న్నాడనే వాదనలు కూడా ఊపందుకున్నాయి. ఇదే జరిగితే, మరోసారి పాకిస్తాన్ సైనిక ప్రభుత్వ కిందకు వెళ్లే అవకాశం…