యూపీలోని పిప్రౌలి గ్రామంలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామంలో నిర్వహించిన ఒక అంత్యక్రియల అనంతరం ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో వడ్డించిన రైతాను సుమారు 200 మంది గ్రామస్తులు తిన్నారు. అయితే ఆ రైతా రేబిస్ సోకిన గేదె పాలతో తయారైనదని విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే, పిప్రౌలి గ్రామానికి చెందిన ఓ రైతు పెంచుతున్న గేదె నుంచి సేకరించిన పాలతో పెరుగు తయారు…